Search
Close this search box.

  కాంచన 4తో మరోసారి భయపెట్టడానికి సిద్ధమైన లారెన్స్..! ఈసారి డబల్ హార్రర్ ..?

రాఘవ లారెన్స్ ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది డ్యాన్స్ , హారర్ సినిమాలు.. హార్రర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా లారెన్స్ పేరు చెప్తారు.. 2007 లో తన మొదటి హరర్ సినిమా ముని తో అందరినీ ఆశ్చర్యపరిచాడు.. ఈ సినిమాతో రాఘవ లారెన్స్ ఆడియెన్స్ కు కొత్తగా కనబడ్డాడు.. అప్పటి వరకు డ్యాన్స్ మాస్టర్ గా , దర్శకుడిగా పలు విభిన్న సినిమాలు చేసిన లారెన్స్.. అప్పటి వరకు చేయని హార్రర్ సినిమా చేయడంతో ఆడియెన్స్ ఫిదా అవ్వడంతో పాటు సినిమా హిట్ గా అయ్యింది.. దాంతో అప్పటి నుండి తనకు కలిసి వచ్చిన హార్రర్ సినిమాలు చేస్తున్నాడు.. ఐతే వీటిలో బాగా పేరొచ్చిన సినిమా కాంచన సినిమా..ముని ఫ్రాంచైజ్ కొనసాగింపుగా వచ్చిన సినిమా. కాంచన సినిమా 2011లో రిలీజ్ అయ్యి ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది.. అలాగే ఒక మంచి కాన్సెప్ట్ తో, వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమా అప్పట్లో రాఘవ లారెన్స్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. దాంతో రాఘవ లారెన్స్ ఈ ఫ్రాంచైజ్ కొనసాగిస్తున్నాడు.. ఇందులో భాగంగా వచ్చినవే.. గంగా, కాంచన3 సినిమాలు..ఐతే ఒక వేదికపై లారెన్స్ మాట్లాడుతూ కాంచన ఫ్రాంచైజ్ నుండి 10 వరకు సినిమాలు ఉంటాయి అని చెప్పాడు.. చెప్పినట్టే ఇప్పుడు మరోసారి కాంచన ఫ్రాంచైజ్ నుండి మరో సినిమా రాబోతుంది.. ఈ సినిమాకు సంబధించిన స్క్రిప్ట్ పనులు అన్నీ పూర్తి అయినట్లు సమాచారం.. వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లి వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారాట.. లారెన్స్ టీం.. ఇప్పటి వరకు వచ్చిన కాంచన సిరీస్ కు ఈ సినిమాకు కంటెంట్ పరంగా డిఫరెన్స్ ఉంటుందని సమాచారం.. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ను తీసుకున్నట్లు సమాచారం. చూడాలి మరి ఈసారి లారెన్స్ ఏ గెటప్ తో భయపెడతాడో..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు