వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఈ సినిమా ఇటీవలే సంక్రాంతికి విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దాదాపు 300 కోట్ల పైగా కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో వెంకటేష్ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ గా, మీనాక్షి చౌదరి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా, ఐశ్వర్య రాజేష్ వెంకటేష్, భార్యగా నటించింది.ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ వచ్చి ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించింది.. దాంతో ఈ సినిమాకు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. సంక్రాంతి సీజన్ కావడంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో వచ్చాయి.. ఐతే ఈ సినిమా ఎప్పుడు ఓటిటిలోకి వస్తుందని అందరూ ఎదుచూస్తున్నారు.. ఐతే ఈ సినిమా ఓటిటి హక్కులను జీ5 భారీ ధరకు కొనుగోలు చేసింది.. ఐతే ఏ సినిమా అయినా థియేట్రికల్ రన్ పూర్తి అయిన తరువాత ఓటిటిలోకి రావడం ఆనవాయితీ గా వస్తుంది.. ఐతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయంలో మాత్రం జీ5 వాళ్ళు ముందుగా టీవీలో టేలికాస్ట్ చేయబోతున్నట్లు అప్డేట్ ఇచ్చారు. అంతే కాదు ఓటిటిలోను, టెలివిజన్ లో ఒకేసారి టేలికాస్ట్ చేయబోతున్నట్లు ప్రకటించారు.. ఐతే ఈ సినిమా టెలివిజన్ లోకి మార్చి 1న సాయంత్రం ఆరు గంటలకు జీ తెలుగు ఛానల్‌తో పాటు జీ5 ఓటీటీలోనూ ఈ సినిమా ఒకేసారి రానుంది. ఈ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు..









