Search
Close this search box.

  ఏపీ స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచి కొత్త పాలసీ..

ఏపీలో వచ్చే ఏడాది నుంచి కొత్త విధానం అమలు చేయబోతున్నట్లు విద్యామంత్రి నారా లోకేష్ ఇవాళ ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఉన్న మున్సిపల్ స్కూల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆయన.. ప్రాథమిక తరగతుల విద్యార్ధుల క్లాస్ రూముల్ని పరిశీలించారు. విద్యార్ధులకు పలు ప్రశ్నలు వేశారు. మధ్యాహ్న భోజనం అందుతున్న తీరుతో పాటు విద్యాబోధనపై ఆరా తీశారు. అలాగే యూనిఫాం, బ్యాగ్స్ పైనా వారిని ప్రశ్నించారు. ఆ తర్వాత అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

 

వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ప్రతి క్లాసుకు ఒక టీచర్ విధానాన్ని అమలు చేస్తామని విద్యామంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎచ్చెర్ల స్కూల్లో విద్యార్థుల వర్క్ బుక్ ను పరిశీలించిన మంత్రి లోకేష్.. చిన్నారుల హ్యాండ్ రైటింగ్ బాగుందని కితాబిచ్చారు. హ్యాండ్ రైటింగ్ మెరుగుదల కోసం కాపీ రైట్ బుక్స్ రాయిస్తున్నామని టీచర్లు చెప్పగా వారిని అభినందించారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ఇదే విధానాన్ని అమలుచేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. మధ్యాహ్న భోజనంలో స్థానిక ఆహారంపై విద్యార్థులు మక్కువ చూపుతున్నందున వాటిని మెనూలో చేర్చాలని అధికారులకు సూచించారు.

 

అలాగే ఎచ్చెర్ల స్కూలు తనిఖీ సందర్భంగా మంత్రి లోకేష్ కాసేపు టీచర్ గా మారి విద్యార్థుల ఐక్యూ టెస్ట్ చేశారు. పలు వస్తువుల పేర్లను ఇంగ్లీషులో అడిగి తెలుగులో సమాధానాలు రాబట్టారు. చిన్నారులు హుషారుగా సమాధానాలివ్వడం, అల్లరి చేస్తూ కేరింతలు కొట్టడంపై మంత్రి లోకేష్ సంతోషం వ్యక్తంచేశారు. అబ్బాయిలు క్లాస్ రూమ్ తలుపు విరగ్గొట్టారని ఒక బాలిక చెప్పడంతో… మీరు రౌడీల మాదిరి ఉన్నారురా అంటూ సరదాగా వారితో చమత్కరించారు. చిన్నప్పుడు తాను కూడా అల్లరి చేసేవాడినని చెప్పారు. విద్యార్థులకు ఏంకావాలని అడిగినపుడు బెంచీలు కావాలని చెప్పడంతో త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.

 

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు