Search
Close this search box.

  ఐపీఎస్‌ల తర్వాత ఆ నేతలే..? వైసీపీలో కలవరం..!

ముంబై నటి కేసులో వైసీపీ నేతలకు భయం పట్టుకుందా? ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు తర్వాత వైసీపీ నేతల్లో కలవరం మొదలైందా? బాధితురాలు వచ్చి ఫిర్యాదు చేసినా వైసీపీ వైఖరి మారలేదా? ఐపీఎస్‌లకు వత్తాసు పలికే విధంగా వ్యవహరిస్తుందా? ఐపీఎస్ అధికారి విశాల్‌గున్నీ అప్రూవర్‌గా మారడంతో ఈ కేసు వైసీపీ పెద్దల మెడకు చుట్టుకుంటుందా? ఇలా రకరకాల ప్రశ్నలు ఆ పార్టీ నేతలు, కేడర్‌ను వెంటాడుతోంది.

 

ముంబై నటి కాదంబరీ జత్వానీ వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌లు బుక్కయ్యారు. వేధింపుల వ్యవహారం వెనుక ఐపీఎస్‌లు ఉన్నట్లు తేలడంతో చంద్రబాబు సర్కార్ వారిపై వేటు వేసింది. కానీ ఈ విషయాన్ని తనకు అనుకూలంగా మలచుకుంది వైసీపీ అధికారిక గెజిట్. తాటికాయంత అక్షరాలతో చంద్రబాబుకు అరెస్ట్‌కు కారణంగానే అధికారులను వేధించినట్టు ప్రస్తావించింది.

 

కాదంబరితో క్విడ్ ప్రొకోకు తెరలేపిందంటూ రాసుకొచ్చింది. ఆమెని నిందితురాలిగా ప్రస్తావించిన ఆ పత్రిక, కుమ్మక్కు అయ్యిందని ప్రస్తావించింది. జత్వానీ కేసు వెనుక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా బాబు సర్కారే అంటూ పుంకాను పుంకాలుగా రాసుకొచ్చింది.

 

చివరకు అఖిల భారత సర్వీసు అధికారులను అవమానిస్తూ వేధిస్తున్నారంటూ ప్రస్తావించింది. ఈ కేసు వ్యవహారంపై రెండుసార్లు కాదంబరీ జత్వానీ విజయవాడ వచ్చింది. ఒకసారి తన ఫిర్యాదును సీపీతోపాటు విచారణ అధికారికి అందజేసింది. వారం కిందట నేరుగా ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం క్షణాల వ్యవధిలో ఐపీఎస్‌‌లపై వేటు పడడం చకచకా జరిగిపోయింది.

 

ఇంతవరకు బాగానే ఉంది. ఎక్కడో ముంబైలో ఉన్న నటిపై విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు చేయడం ఏంటి? కేసు నమోదుకు ముందే ఐపీఎస్ అధికారి ముంబైకి వెళ్లడమేంటి? ఎస్ఐ, సీఐ స్థాయి అధికారులు దర్యాప్తు చేయవలిసిన కేసులో ఐపీఎస్‌లు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? అనేది ఎక్కడా ప్రస్తావించలేదు అధికారిక గెజిట్. కావాలనే కొందరు అధికారులను టార్గెట్ చేసిందంటూ పేర్కొంది.

 

వైసీపీ గెజిట్ ప్రకారం పరిశీలిస్తే.. ఐపీఎస్ అధికారి ఎందుకు వాగ్మూలం ఇచ్చినట్టు? ఆ అధికారి ఇచ్చిన సమాచారం ఆధారంగానే ప్రభుత్వానికి నివేదిక వెళ్లడం, వారిపై వేటు వేయడం వేగంగా జరిగి పోయింది. ఐదేళ్ల కిందకు ఒక్కసారి వెళ్దాం. గతంలోకి వెళ్తే.. చంద్రబాబు సర్కార్‌లో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించిన అప్పటి ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును నాలుగున్నరేళ్లు సస్పెండ్ చేసింది. చివరకు ఆయన కోర్టును ఆశ్రయించడంతో చివరిరోజు పోస్టింగ్ ఇచ్చింది. దీని మాటేంటని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.

 

ఐపీఎస్ ట్రైనింగ్‌లో ఈ విధంగా చేయాలని చెబుతారా అని మరికొందరి ప్రశ్న. అయినా ఐపీఎస్‌ల తర్వాత నెక్ట్స్ టార్గెట్ వైసీపీ నేతలేనని ఓపెన్‌గా చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈ ఎపిసోడ్‌లో ఐపీఎస్ ఆంజనేయులు పేరు బలంగా వినిపిస్తోంది. ఈయన నోరు విప్పితే అసలు సూత్ర, పాత్రదారులు బయటకు వస్తారని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. మొత్తానికి వైసీపీ నేతలకు ముందుంది ముసళ్ల పండగన్నమాట

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు