సామర్లకోట ఫ్లైఓవర్ బ్రిడ్జి దిగువున పాత రిజిస్టర్ ఆఫీస్ వద్ద స్కూల్ పిల్లలను ఎక్కించుకుంటున్న ప్రైవేటు స్కూల్ బస్సును వెనుక నుండి లారీ ఢీ కొట్టింది.బస్సు వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది.ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.20 మంది విద్యార్థులతో స్కూల్ బస్సు పెద్దాపురం నుండి కాకినాడ వెళుతుండగా ఈ సంఘటన జరిగింది.
