ఆంధ్రప్రదేశ్: దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై చేసిన ఆరోపణలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా ‘మీ భర్త ఎవరో వివరణ ఇవ్వండి’ అంటూ శాంతికి దేవదాయ శాఖ నోటీసులు ఇచ్చింది. ‘ఉద్యోగంలో చేరినప్పుడు భర్త పేరు మదన్మోహన్ అని పేర్కొన్నారు. ఇటీవల ప్రెస్ మీట్ లో సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. ఇది ఉద్యోగి ప్రవర్తనా నియమావళికి విరుద్ధం’ అని నోటీసుల్లో పేర్కొంది.
