Search
Close this search box.

  గవర్నర్‌ను కలిసిన జగన్.. ఆ అంశంపై ఫిర్యాదు..

ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ఆదివారం సాయంత్రం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆయన వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, హత్యలు, దాడులు విధ్వంసాలు చేస్తున్నారంటూ ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను గవర్నర్‌కు సమర్పించినట్లు సమావేశం అనంతరం వైసీపీ నేతలు తెలిపారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు