కాకినాడ జిల్లా పిఠాపురం పుణ్యక్షేత్రం శ్రీపాద శ్రీ వల్లభుడిని ఆదివారం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ లక్ష్మీదేవి దంపతులు దర్శించుకున్నారు. గురు పౌర్ణమి వేడుకను పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు చేసిన ఏర్పాట్లపై వర్మ ఆరా తీశారు. ఆయనతోపాటు టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పూజల్లో పాల్గొన్నారు
