కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో రథాలపేట సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ లో సోమవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టర్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి నేరుగా అర్జీలు స్వీకరిస్తారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నుండి రెండు వారాలకు ఒకసారి ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పి జి ఆర్ ఎస్) పిఠాపురంలో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ దగ్గరుండి చూస్తున్నారు
