గురు పౌర్ణమి మహా పర్వదినం పురస్కరించుకుని ఆదివారం సామర్లకోట,పెద్దాపురం పట్టణ, మండల పరిధిలో షిరిడీ సాయిబాబా ఆలయాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఉదయం నుండి సాయి బాబా వారికి పంచామృతాలతో అభిషేకాలు,అర్చనలు,విశేష పూజలు చేశారు.
సామర్లకోట పట్టణ పరిధి స్టేషన్ సెంటర్,పెద్ద బజార్ వద్ద సాయిబాబా ఆలయం,పెద్దాపురం కోర్డుల వద్దగల బాబా వారి ఆలయంలోను ప్రత్యేక పూజలు నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని బాబా వారిని దర్శించుకున్నారు.పెద్దాపురం ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాయల రంగనాగ్,తెలుగుదేశం నాయకులు కుమార స్వామి,కంటే జగదీష్ మోహన్,బడుగు శ్రీకాంత్,గోలి దొరబాబు,నిమ్మకాయల కిరణ్,వల్లూరి దొర తదితరులు స్వామి వారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆలయ కమిటీ స్థానిక రైల్వే కళ్యాణ మండపం ఆవరణలో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించగా సుమారు 10వేల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.