ఏపీలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్ లు చేపట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం తప్పడంలేదు. ఇటీవలే పెద్ద ఎత్తున ఐపీఎస్ లను బదిలీ చేశారు. పలు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. తాజాగా, ఐఏఎస్ లను బదిలీ చేశారు. పలు కీలక శాఖలకు కమిషనర్లను, ఎండీలను, డైరెక్టర్లను, సీఈవోలను, సీఎండీలను, జాయింట్ కలెక్టర్లను నియమించారు.
కాగా, పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ యువ ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజ నియమితులయ్యారు. ఆయన ఇటీవల కేరళ నుంచి డిప్యుటేషన్ పై ఏపీకి వచ్చారు. కృష్ణతేజ… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఓఎస్డీగా నియమితులవుతారంటూ ప్రచారం జరిగింది. అయితే, పవన్ నిర్వహిస్తున్న శాఖలకే డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు