సామర్లకోట మండలంలో అల్పపీడనం కారణంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటపొలాలు నీట మునిగాయి. వరద జలాలు భారీగా వచ్చి చేరుకోవడంతో ఏలేరు, గోదావరి కాలువలకు వరద పోటు తగిలింది. ఈ రెండు కారణాలతో లోతట్టు ప్రాంతాలోని పలు గ్రామాల్లో వరి పొలాలు పుంపునకు గురయ్యాయి. మండల పరిధిలో ఇప్పటి వరకూ 30 హెక్టార్ లలో వెదజల్లే పద్ధతిలోనూ, అయిదు హెక్టార్ లలో నాట్లు ద్వారా జరిగిన పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. సామర్లకోట మండలంలో ప్రధాన కాలువలు పొంగిపొర్లుతున్నాయి
