కాకినాడ జిల్లా పెద్దాపురం వాలు తిమ్మాపురం రోడ్డులోని టిడ్కో హౌసింగ్ కాలని వాసులతో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప సమావేశ నిర్వహించారు.బ్యాంకు రుణాలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నామని ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యే రాజప్ప దృష్టికి తీసుకువెళ్లారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా రాజప్ప వారికి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే రాజప్ప తో పాటు జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు, నియోజవర్గ జనసేన ఇంచార్జ్ తుమ్మల రామస్వామి (బాబు), టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, టిడిపి,జనసేన,బిజెపి నాయకులు, కార్యకర్తలు.