Search
Close this search box.

  1995 నుండి 2024 వ‌ర‌కూ విద్యుత్ రిఫార్మ్స్‌పై చంద్ర‌బాబు క్లాస్‌

1995 నుండి 2024 వ‌ర‌కూ విద్యుత్ రిఫార్మ్స్‌పై చంద్ర‌బాబు క్లాస్‌

ప్ర‌స్తుతం విద్యుత్ స‌ర‌ఫ‌రా, నాణ్య‌త‌ల‌పై చంద్ర‌బాబు స్పందించారు. గ‌తంలో తాను ప‌నిచేసిన 1995 నుండి ఇప్ప‌టి వ‌ర‌కూ విద్యుత్ విధానాల‌ను వెల్ల‌డించారు. 1995-2004 వ‌ర‌కూ దేశంలోనే ఏపీలో సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చామ‌న్నారు. అదే స‌మయంలో డిస్ట్రీబ్యూష‌న్ కంపెనీల‌ను తెర‌పైకి తీసుకొచ్చామ‌న్నారు. ఎన్నిక‌ల ముందు నాణ్య‌మైన విద్యుత్‌ను ధ‌ర‌లు పెంచ‌కుండా ఇస్తామ‌న్న మాట‌ను ఈసంద‌ర్భంగా చంద్ర‌బాబు గుర్తు చేశారు. గ‌త ప్ర‌భుత్వాలు చేసిన త‌ప్పిదాల‌ను వివ‌రించారు. 2014 నుండి 2018 వ‌ర‌కూ ఉన్న‌తంగా ప‌నిచేశామ‌న్నారు. వైసీపీ ప్ర‌భుత్వం ఎక్క‌డ ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేసిందో, ఎందుకు చేసిందో కూడా అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. త‌వ్వేకొద్ది అక్ర‌మాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయ‌ని, స‌ముద్రంలోకి దిగితేనే లోతు తెలుస్తుంద‌న్న‌ట్టుగా ప‌రిస్థితి ఉంద‌న్నారు. అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఇదే తీరు ఉంద‌న్నారు. ప్ర‌జ‌లు త‌మ‌పై పెట్టుకున్న న‌మ్మకాన్ని నిల‌బెట్టుకుంటామ‌న్నారు.

 

స్టేట్ లెవల్ బ్యాంకర్స్ తో బాబు భేటి

చంద్ర‌బాబు స‌ర్కార్ ఏర్పాటైన త‌ర్వాత తొలిసారిగా బ్యాంక‌ర్స్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ప్ర‌స్తుతం ఆర్థిక స్థితిగ‌తులు, రుణాల విడుద‌ల త‌దిత‌ర అంశాల‌పై బ్యాంక‌ర్స్‌తో బాబు భేటిలో మాట్లాడారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5,40,000 కోట్లతో రుణ ప్రణాళిక విడుదల చేశారు. డైరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో మౌళిక సదుపాయాలకు రూ.32,600 కోట్లతో రుణ ప్రణాళిక ప్రకటించారు. 5 ప్రధాన అంశాలపై మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకర్లతో సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు, యూనియన్ బ్యాంక్ ఈడీ సంజయ్ రుద్ర, ఎస్.ఎల్.బీ.సీ కన్వీనర్ సీవిఎన్ భాస్కర్ రావు, ఇతర బ్యాంకు అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు