2024 సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలు సమయంలో పోలీసులు దాడుల నిర్వహించి స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యంను గురువారం కాకినాడ రూరల్ మండలం సూర్యరావుపేట గ్రామంలోని న్యూ ఎన్టీఆర్ బీచ్ ఎదురుగా రోడ్లు భవనాలు అతిథి గృహం వద్ద ధ్వంసం చేశారు.
జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ స్వీయ పర్యవేక్షణలో కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న సెబ్ స్టేషన్లు, శాంతిభద్రతల పోలీస్ స్టేషన్ల సంబంధించిన 2024 ఎలక్షన్ పీరియడ్లో స్వాధీన పర్చుకున్న అక్రమ మద్యం, నాటు సారాలను ధ్వంసం చేశారు. ఇందులో 1406 కేసులలో (ఐడి, ఎండిపిఎల్, డిపిఎల్) నమోదు చేయబడిన 32,040.475 లీటర్ల సుమారు రూ.1,65,69000/- విలువచేసే అక్రమ మద్యం, నాటు సారాను ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో సెబ్ అడిషనల్ ఎస్పీ కె శ్రీలక్ష్మి, సెబ్ సూపరింటెండెంట్ జె రవికుమార్, అసిస్టెంట్ సెబ్ సూపరింటెండెంట్ ఎ శ్రీరంగం దొర, కాకినాడ జిల్లాకు చెందిన సెబ్, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.