నందమూరి బాలకృష్ణ అంటేనే పవర్ఫుల్ డైలాగులు, ఊరమాస్ యాక్షన్ సీన్లు గుర్తొస్తాయి. అలాంటి బాలయ్యతో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడు శివ నిర్వాణ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం టాలీవుడ్లో ఇదే ఆసక్తికరమైన చర్చగా మారింది.
బాలకృష్ణ ప్రస్తుతం తన సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండగా, దర్శకుడు శివ నిర్వాణ ఆయనను కలిసి ఓ కథా లైన్ వినిపించినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. శివ నిర్వాణ చెప్పిన కాన్సెప్ట్ బాలయ్యకు నచ్చిందని, దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం పూర్తి కథను కాకుండా కేవలం స్టోరీ లైన్ మాత్రమే వినిపించారట. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత బాలయ్యకు పూర్తి కథను వివరించనున్నట్లు సమాచారం. ఈ ఫుల్ నేరేషన్ తర్వాతే ప్రాజెక్ట్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని టాక్.
ఇక శివ నిర్వాణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమకథలు, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలను తెరపై అందంగా చూపించడంలో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
‘నిన్ను కోరి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాణ, ‘మజిలీ’తో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు.
మరోవైపు బాలకృష్ణ కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి మాస్ హీరోకు శివ నిర్వాణ తనదైన శైలిలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన కథను అందిస్తే, అది కొత్త తరహా సినిమాగా నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
బాలయ్య పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు శివ నిర్వాణ ఎమోషనల్ టేకింగ్ తోడైతే ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుందా? అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.
అయితే బాలకృష్ణ, శివ నిర్వాణ కాంబినేషన్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ప్రస్తుతం వస్తున్న వార్తలను ప్రచారంగానే చూడాలి.
మరి బాలయ్య, శివ నిర్వాణ కాంబినేషన్లో సినిమా వస్తే మీరు ఎలాంటి కథను కోరుకుంటారు? ఫుల్ మాస్ యాక్షనా.. లేక మాస్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్నా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి!








