పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కల్కి 2898 AD’ ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఈ సినిమా క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్టులతో ఇప్పుడు సీక్వెల్ ‘కల్కి 2’పై అంచనాలు మరింత పెరిగాయి.
అయితే తాజాగా ‘కల్కి 2’కు సంబంధించి ఫిల్మ్‌నగర్‌లో ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ‘కల్కి 2898 AD’లో ప్రభాస్ పోషించిన భైరవ పాత్రకు పెంపుడు తండ్రి, గురువు పాత్రలో కనిపించిన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు ‘కల్కి 2’లో కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.
పార్ట్-1లో దుల్కర్ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. ఆయన పాత్ర సినిమాకు ప్రత్యేకమైన ఇంపాక్ట్ ఇచ్చింది. ఇప్పుడు సీక్వెల్ స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లేలో చేసిన కొన్ని మార్పుల కారణంగా దుల్కర్ పాత్రకు మరింత ప్రాధాన్యత పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే దుల్కర్ సల్మాన్ ‘కల్కి 2’లో ఎంతసేపు కనిపిస్తారు? ఆయన పాత్ర కథలో ఎలాంటి మలుపు తీసుకురాబోతోంది? అనే విషయాలపై ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. ఈ వార్తపై వైజయంతీ మూవీస్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
మరోవైపు ‘కల్కి 2’ రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించి కూడా ఓ కీలక అప్డేట్ వినిపిస్తోంది. ప్రభాస్ వచ్చే నెల నుంచే ఈ సీక్వెల్ షూటింగ్‌లో పాల్గొననున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇక పార్ట్-1 క్లైమాక్స్‌లో యస్కిన్‌గా కమల్ హాసన్ చూపించిన పవర్‌ఫుల్ అవతారం, కర్ణుడిగా ప్రభాస్ ఎంట్రీ, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ పాత్ర.. ‘కల్కి 2’పై అంచనాలను మరింత పెంచేశాయి.
ఇప్పుడు దుల్కర్ సల్మాన్ పాత్ర కూడా సీక్వెల్‌లో కీలకంగా ఉండబోతోందనే వార్త నిజమైతే.. ఈ ప్రాజెక్ట్‌పై క్రేజ్ మరింత పెరగడం ఖాయం. మరి ఈ విషయంపై మేకర్స్ ఎప్పుడు అధికారికంగా క్లారిటీ ఇస్తారో చూడాలి.








