Search
Close this search box.

  టాక్ షో కోసం మెగాస్టార్‌కు కళ్లుచెదిరే రెమ్యునరేషన్..! ఎంతో తెలుసా..?

September 29, 2026 7:52 PM | Aditya369 News

టాక్ షో కోసం మెగాస్టార్‌కు కళ్లుచెదిరే రెమ్యునరేషన్..! ఎంతో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లోకి అడుగుపెట్టబోతున్నారా? ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్.. చిరంజీవితో ఓ భారీ సెలబ్రిటీ టాక్ షో చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అంతేకాదు, ఈ డీల్ ప్రస్తుతం తుది దశకు చేరుకుందని, షో కోసం మెగాస్టార్‌కు ఏకంగా రూ.200 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ టాక్ షోను భారీ ఎంటర్టైన్మెంట్‌తో రూపొందించేలా కాన్సెప్ట్ సిద్ధం చేస్తున్నారట. నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోతో అనుభవం ఉన్న బీవీఎస్ రవి ఈ కొత్త షో కాన్సెప్ట్‌పై వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డీల్‌ను పర్యవేక్షిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ‘కాకా’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్‌ను నవంబర్ నాటికి పూర్తి చేసి, 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

‘కాకా’ షూటింగ్ పూర్తయిన తర్వాత చిరంజీవి ఈ టాక్ షో కోసం కెమెరా ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

మరోవైపు చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

అయితే చిరంజీవి-నెట్‌ఫ్లిక్స్ టాక్ షో, రూ.200 కోట్ల రెమ్యునరేషన్ వంటి వార్తలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. మరి నిజంగానే మెగాస్టార్ డిజిటల్ ఎంట్రీ ఇస్తారా? అనేది తెలియాలంటే అధికారిక క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు