Search
Close this search box.

  త్రివిక్రమ్ గడ్డం వెనుక అసలు సీక్రెట్ ఇదే..!

September 29, 2026 7:42 PM | Aditya369 News

త్రివిక్రమ్ గడ్డం వెనుక అసలు సీక్రెట్ ఇదే..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైలాగ్ రైటర్‌గా, రచయితగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. ప్రస్తుతం సినిమాలు నిర్మిస్తూనే.. మరోవైపు దర్శకుడిగా కూడా కొనసాగుతున్నారు.

ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను జోరుగా నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే వెంకటేష్, త్రివిక్రమ్ కలిసి యాంకర్ సుమతో సరదాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు త్రివిక్రమ్ వ్యక్తిగత విషయాలపై కూడా సుమ ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు.

అందులో భాగంగా.. త్రివిక్రమ్ ఎప్పుడూ గడ్డంతోనే ఎందుకు కనిపిస్తారు? అని సుమ ప్రశ్నించారు. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్‌ను గుర్తు చేస్తూ.. సింహం మాత్రమే కాదు, త్రివిక్రమ్ కూడా గడ్డం గీసుకోరా? అంటూ సరదాగా అడిగారు.

దీనికి త్రివిక్రమ్ కూడా తనదైన స్టైల్‌లో ఫన్నీగా సమాధానం ఇచ్చారు. పెళ్లయిన కొత్తలో తన భార్య తనను గడ్డం లేకుండా చూశారని.. అప్పటి నుంచి తాను గడ్డంతోనే ఉంటున్నానని చెప్పారు. అంతేకాదు, తాను గడ్డం తీసేస్తే అసలు ఎవరూ గుర్తుపట్టకపోవచ్చని సరదాగా అన్నారు.

ఇక్కడితో ఆగకుండా తన ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్‌లో కూడా గడ్డంతో ఉన్న ఫొటోలే ఉన్నాయని త్రివిక్రమ్ చెప్పారు. ఒకవేళ గడ్డం తీసేస్తే ఇమిగ్రేషన్ దగ్గర కూడా సమస్యలు రావచ్చని చమత్కరించారు. దీంతో త్రివిక్రమ్ గడ్డం వెనుక ఉన్న ఈ ఫన్నీ సీక్రెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ విషయానికి వస్తే.. త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ ఇదే మొదటిసారి డైరెక్టర్-హీరోగా వస్తున్న సినిమా. అయితే గతంలో వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాలకు త్రివిక్రమ్ కథ, మాటల విషయంలో పనిచేశారు.

కానీ ఇప్పుడు మొదటిసారి వెంకటేష్‌ను త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్లు ఇప్పటికే విడుదలైన టీజర్ చూస్తే అర్థమవుతోంది.

మరి ఇన్నేళ్లుగా రచయితగా కలిసి పనిచేసిన త్రివిక్రమ్.. ఇప్పుడు దర్శకుడిగా వెంకటేష్‌ను ఎలా చూపించబోతున్నారు? ఈ కొత్త కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే అక్టోబర్ 9 వరకు వేచి చూడాల్సిందే.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు