Search
Close this search box.

  పూరి, ఛార్మి నమ్మకద్రహం బయటపెట్టిన ప్రొడ్యూసర్..!

September 28, 2026 8:06 PM | Aditya369 News

పూరి, ఛార్మి నమ్మకద్రహం బయటపెట్టిన ప్రొడ్యూసర్..!

మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత, నిర్మాత చైతన్య రెడ్డి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలోని ఆర్థిక వ్యవహారాలు, డిస్ట్రిబ్యూషన్ సమస్యలు, అగ్రిమెంట్ల విషయంలో ఎదురయ్యే ఇబ్బందులపై ఓపెన్‌గా మాట్లాడారు.

ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్, చార్మీతో తమకు ఎదురైన అనుభవాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

చైతన్య రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన **‘డబుల్ ఇస్మార్ట్’**ను డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు దాదాపు రూ.25 కోట్లు చెల్లించారట. అప్పటికే ‘ఇస్మార్ట్ శంకర్’ మంచి వసూళ్లు సాధించడంతో సీక్వెల్ కూడా రూ.40–45 కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు.

అయితే సినిమా డీల్ సమయంలోనే కొన్ని షరతులు పెట్టామని చైతన్య రెడ్డి చెప్పారు. సినిమా నాణ్యత, గత చిత్రాలకు సంబంధించిన వివాదాలు రిలీజ్‌కు అడ్డంకిగా మారకుండా ఉంటేనే డీల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నామని.. ఏదైనా సమస్య వస్తే పరిమిత నష్టంతో ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేలా ఎగ్జిట్ క్లాజ్ కూడా పెట్టుకున్నామని వెల్లడించారు.

కానీ సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు పూరి జగన్నాథ్ గత సినిమాకు సంబంధించిన ఓ వివాదం తెరపైకి రావడంతో పరిస్థితులు మారిపోయాయని ఆయన తెలిపారు. దీంతో తాను మిగిలిన మొత్తాన్ని చెల్లించకుండా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని భావించానని.. అయితే చార్మీ వచ్చి ఈ సమయంలో వెనక్కి వెళ్లొద్దని కోరినట్లు చెప్పారు.

అదే సమయంలో తన భర్త, నిర్మాత నిరంజన్ రెడ్డి కూడా ఈ విషయంలో తనను ఒప్పించారని చైతన్య రెడ్డి తెలిపారు. పేపర్స్ కంటే మనుషులపై నమ్మకం పెట్టుకోవాలని చెప్పడంతో మిగిలిన డబ్బు కూడా చెల్లించాల్సి వచ్చిందని వెల్లడించారు.

ఇక సినిమా రిలీజ్‌కు ముందు రోజు వరకు కూడా ఫైనాన్షియర్ల నుంచి అనుమతులు తీసుకోవడం, డిజిటల్ ప్రింట్లకు పర్మిషన్లు తెచ్చుకోవడం కోసం ఛాంబర్‌లో పోరాడాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఈ కారణంగానే ప్రమోషన్స్ సరిగ్గా జరగలేదని, కొన్ని చోట్ల రిలీజ్ షోలు కూడా ఆలస్యంగా పడ్డాయని పేర్కొన్నారు.

సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయిన తర్వాత తమకు పూరి ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి సరైన స్పందన రాలేదని చైతన్య రెడ్డి ఆరోపించారు. రికవరీ విషయమై మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు ఇబ్బందులు ఎదురయ్యాయని, ఫోన్ నంబర్లు కూడా బ్లాక్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ పరిణామాల వల్ల తాను కొన్ని నెలల పాటు తీవ్ర ఒత్తిడికి గురయ్యానని, తన భర్త కూడా ఈ విషయంలో బాధపడ్డారని తెలిపారు.

అంతేకాదు.. ఆ తర్వాత పూరి జగన్నాథ్‌ను మరో చిన్న సినిమా చేయాలని కోరినప్పుడు కూడా డైరెక్షన్ కోసం రూ.10 కోట్లకు పైగా పారితోషికంతో పాటు సినిమాలో వాటా అడిగారని చైతన్య రెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయిన తమ పరిస్థితిలో ఇలా అడగడం తనకు బాధ కలిగించిందని అన్నారు.

అయితే గతంలో ‘ఇస్మార్ట్ శంకర్’కు సంబంధించిన ఫైనాన్షియల్ సమస్యల్లో దాదాపు 90–95 శాతం మొత్తాన్ని క్లియర్ చేశామని చైతన్య రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో మరే నిర్మాత కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోకూడదనే ఉద్దేశంతోనే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫిలిం ఛాంబర్ వ్యవహారాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నట్లు వెల్లడించారు.

మొత్తానికి చైతన్య రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఆయన చేసిన ఆరోపణలపై పూరి జగన్నాథ్, చార్మీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు