కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి నటించిన లేటెస్ట్ సినిమా ‘డిసి’. దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ మూవీతో లోకేష్ కనగరాజ్ నటుడిగా అదిరిపోయే డెబ్యూ అందుకున్నారు.
తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి స్పందనను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన సమాచారం కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
సెప్టెంబర్ 4 నుంచి ‘డిసి’ సినిమా ఒకటి కాదు ఏకంగా రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్కు రానున్నట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్స్ట్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
తమిళంతో పాటు తెలుగు భాషలో కూడా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించింది. సంజన, వామికా గబ్బి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ‘డిసి’ ఓటీటీలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో చూడాలి.








