నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన కెరీర్లోనే భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత నాని చేయబోయే మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘బ్లడీ రోమియో’. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించబోతున్న ఈ సినిమాపై నాని అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ‘బ్లడీ రోమియో’తో పాటు సుజీత్‌కు ‘OG 2’ బాధ్యత కూడా ఉండటంతో.. అసలు ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది? ఎలాంటి అప్డేట్స్ రాబోతున్నాయి? అనే ఆసక్తి ఫ్యాన్స్‌లో పెరిగిపోయింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ‘బ్లడీ రోమియో’కు సంబంధించి ఓ ఆసక్తికరమైన క్లారిటీ బయటకు వచ్చింది.
సంగీత దర్శకుడిపై క్లారిటీ వచ్చేసిందా?
ఇటీవల విడుదలైన యానిమేషన్ టీజర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. ఆ టీజర్ తర్వాత ‘బ్లడీ రోమియో’కు సంగీతం ఎవరు అందించబోతున్నారనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి.
ముఖ్యంగా ‘ధురంధర్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు శశ్వత్ సచ్దేవ్ ‘బ్లడీ రోమియో’కు మ్యూజిక్ అందించబోతున్నారనే రూమర్స్ బలంగా వినిపించాయి.
కానీ ఇప్పుడు ఆ వార్తలకు దాదాపు చెక్ పడినట్టే కనిపిస్తోంది.
‘గెట్ రెడీ’ అంటూ హింట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!
‘బ్లడీ రోమియో’ యానిమేషన్ టీజర్‌కు సంగీతం అందించిన ప్రవీణ్ లక్కరాజు తాజాగా ఫ్యాన్స్‌కు ‘గెట్ రెడీ’ అంటూ హింట్ ఇవ్వడంతో.. సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ త్వరలోనే రాబోతుందనే టాక్ మొదలైంది.
దీంతో ‘బ్లడీ రోమియో’కు సంగీతం అందించేది ప్రవీణ్ లక్కరాజే అనే క్లారిటీ వచ్చినట్టుగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అంటే యానిమేషన్ టీజర్లో తన మ్యూజిక్‌తో ఇంప్రెస్ చేసిన ప్రవీణ్.. ఇప్పుడు సినిమా మొత్తానికి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వబోతున్నారనే ఆసక్తి మరింత పెరిగింది.
మరోవైపు సినిమా నుంచి త్వరలోనే ఓ భారీ అప్డేట్ రాబోతుందనే హింట్ కూడా దొరకడంతో నాని అభిమానుల్లో ఉత్సాహం పెరిగిపోయింది.
మొత్తానికి.. ‘బ్లడీ రోమియో’ నుంచి బిగ్ అప్డేట్కు రంగం సిద్ధమైనట్టే కనిపిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా దాదాపు క్లారిటీ రావడంతో.. ఇక మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








