ప్రభాస్ హీరోగా నాన్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ప్రభాస్ హీరోగా నాన్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 27 నుంచి రెండు వారాల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ నిర్మాత అశ్వనీదత్ చేసిన వినతిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ‘కల్కి 2898 ఏడీ’ చిత్ర టికెట్పై సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్ ల్లో రూ.125 వరకు పెంచుకోవచ్చని పేర్కొంది. దీంతో పాటు రోజుకు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.
సినీ నిర్మాతలు కలిసిన 24 గంటల్లోపే సినీ పరిశ్రమ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం సహకారం ఉంటుందన్న సంకేతాలను జనంలోకి తీసుకెళ్లింది. గతంలో తమ సినిమాలకు టిక్కెట్ల ధరల పెంపునకు, సినీ అభివృద్ధికి చిరంజీవి, నాగార్జున, మహేష్‌బాబు, ప్రభాస్ వంటి అ్రగనటులు జగన్‌ను కోరారు. ఆసందర్భంలో సినీ నటులను జగన్ పెద్దగా పట్టించుకోలేదని, అప్పట్లో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. చంద్రబాబు, పవన్‌ను నిర్మాతలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వారికి అన్ని అవకాశాలు కల్పిస్తామనడంతో సినీ ఇండస్ట్రీకి పాత రోజులు వచ్చాయని సీనీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.