Search
Close this search box.

  వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ టీజర్ రిలీజ్.. హారర్ కామెడీతో అదరగొట్టేశాడు..!

July 14, 2026 9:04 AM | Aditya369 News

వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ టీజర్ రిలీజ్.. హారర్ కామెడీతో అదరగొట్టేశాడు..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కెరీర్‌లో తొలిసారి హారర్ కామెడీ జానర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం 'కొరియన్ కనకరాజు'. ఇప్పటివరకు ప్రేమకథలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, యాక్షన్ చిత్రాలతో అభిమానులను అలరించిన వరుణ్.. ఈసారి పూర్తిగా భిన్నమైన కథతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఆ ఆసక్తిని మరింత పెంచుతూ చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది.

ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. టీజర్ ప్రారంభం నుంచే రాయలసీమ బ్యాక్‌డ్రాప్, వరుణ్ తేజ్ మాస్ లుక్, పవర్‌ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

"మాది రాయలసీమ... మా ఊరు పెనుగొండ... కనకరాజు గాడికి బలమైన కారణం ఉంటే తప్ప మందు ముట్టడు" అనే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. ఆ తర్వాత వరుణ్ తేజ్, కమెడియన్ సత్య మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు మంచి వినోదాన్ని పంచుతాయి.

ఇక హీరోయిన్ రితికా నాయక్ కొరియన్ భాషలో మాట్లాడుకుంటూ ఎంట్రీ ఇవ్వడం కథపై ఆసక్తిని పెంచుతుంది. అనంతరం కొరియన్ గుర్తు ఉన్న ఒక రహస్యమైన బాటిల్ తెరవగానే వరుణ్ తేజ్‌లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. అతని కళ్ల రంగు నీలంగా మారిపోవడం, హారర్ ఎలిమెంట్స్‌తో కూడిన విజువల్స్ కథలోని మిస్టరీని మరింత ఎలివేట్ చేస్తాయి.

హారర్, కామెడీ, యాక్షన్ అంశాల మేళవింపుతో సాగిన టీజర్ చివర్లో వరుణ్ తేజ్ గ్యాంగ్‌స్టర్ అవతారంలో కనిపించడం మరో సర్‌ప్రైజ్‌గా నిలిచింది. పవన్ కళ్యాణ్ 'OG' స్టైల్‌ను గుర్తు చేసే ఆ లుక్ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచింది. దీనికి తోడు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ రెడ్డి, వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇండో-కొరియన్ సంస్కృతిని హారర్ కామెడీ అంశాలతో మేళవిస్తూ ఒక కొత్త తరహా వినోదాన్ని ప్రేక్షకులకు అందించేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.

ఇప్పటివరకు వరుణ్ తేజ్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకునే సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'కొరియన్ కనకరాజు' ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా? హారర్ కామెడీ జానర్‌లో వరుణ్ చేసిన ఈ ప్రయోగం ప్రేక్షకులను మెప్పిస్తుందా? అన్నది తెలుసుకోవాలంటే ఆగస్టు 7 వరకు వేచి చూడాల్సిందే.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కెరీర్‌లో తొలిసారి హారర్ కామెడీ జానర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఇప్పటివరకు ప్రేమకథలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, యాక్షన్ చిత్రాలతో అభిమానులను అలరించిన వరుణ్.. ఈసారి పూర్తిగా భిన్నమైన కథతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఆ ఆసక్తిని మరింత పెంచుతూ చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది.

ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. టీజర్ ప్రారంభం నుంచే రాయలసీమ బ్యాక్‌డ్రాప్, వరుణ్ తేజ్ మాస్ లుక్, పవర్‌ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

“మాది రాయలసీమ… మా ఊరు పెనుగొండ… కనకరాజు గాడికి బలమైన కారణం ఉంటే తప్ప మందు ముట్టడు” అనే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. ఆ తర్వాత వరుణ్ తేజ్, కమెడియన్ సత్య మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు మంచి వినోదాన్ని పంచుతాయి.

ఇక హీరోయిన్ రితికా నాయక్ కొరియన్ భాషలో మాట్లాడుకుంటూ ఎంట్రీ ఇవ్వడం కథపై ఆసక్తిని పెంచుతుంది. అనంతరం కొరియన్ గుర్తు ఉన్న ఒక రహస్యమైన బాటిల్ తెరవగానే వరుణ్ తేజ్‌లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. అతని కళ్ల రంగు నీలంగా మారిపోవడం, హారర్ ఎలిమెంట్స్‌తో కూడిన విజువల్స్ కథలోని మిస్టరీని మరింత ఎలివేట్ చేస్తాయి.

హారర్, కామెడీ, యాక్షన్ అంశాల మేళవింపుతో సాగిన టీజర్ చివర్లో వరుణ్ తేజ్ గ్యాంగ్‌స్టర్ అవతారంలో కనిపించడం మరో సర్‌ప్రైజ్‌గా నిలిచింది. పవన్ కళ్యాణ్ ‘OG’ స్టైల్‌ను గుర్తు చేసే ఆ లుక్ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచింది. దీనికి తోడు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ రెడ్డి, వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇండో-కొరియన్ సంస్కృతిని హారర్ కామెడీ అంశాలతో మేళవిస్తూ ఒక కొత్త తరహా వినోదాన్ని ప్రేక్షకులకు అందించేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.

ఇప్పటివరకు వరుణ్ తేజ్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకునే సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కొరియన్ కనకరాజు’ ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా? హారర్ కామెడీ జానర్‌లో వరుణ్ చేసిన ఈ ప్రయోగం ప్రేక్షకులను మెప్పిస్తుందా? అన్నది తెలుసుకోవాలంటే ఆగస్టు 7 వరకు వేచి చూడాల్సిందే.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు