‘అనగనగా ఒక రాజు’ సినిమాతో మరోసారి తన సక్సెస్ ట్రాక్‌ను కొనసాగించిన యువ హీరో నవీన్ పోలిశెట్టి… ఇప్పుడు తన నెక్స్ట్ మూవీతో మరో సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ టాలీవుడ్లో వైరల్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం… నవీన్ పోలిశెట్టి తన తదుపరి చిత్రాన్ని తమిళ దర్శకుడు ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో చేయబోతున్నాడని తెలుస్తోంది. ‘సైరన్’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆంటోనీ… ఇప్పుడు నవీన్‌తో ఓ డిఫరెంట్ ఎంటర్టైనర్ను ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
నవీన్‌కు ఉన్న అద్భుతమైన కామెడీ టైమింగ్, ఆంటోనీ భాగ్యరాజ్ మేకింగ్ స్టైల్ కలిస్తే ఈ సినిమా పూర్తిగా కొత్త అనుభూతిని అందించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలకు ప్రాధాన్యం ఇస్తున్న మైత్రీ సంస్థ… ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలో ప్లానింగ్ చేస్తోందట.
ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటనతో పాటు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.
కథల ఎంపికలో ఎప్పుడూ కొత్తదనాన్ని చూపించే నవీన్ పోలిశెట్టి… ‘జాతిరత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’, తాజాగా ‘అనగనగా ఒక రాజు’ విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ కొత్త కాంబినేషన్ కూడా ఆయన కెరీర్లో మరో బిగ్ హిట్‌గా నిలుస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
మరి నవీన్ – ఆంటోనీ భాగ్యరాజ్ – మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.








