Search
Close this search box.

  పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు.. ‘ఓజీ 2’ నుంచి థమన్ మాస్ సర్‌ప్రైజ్..!

June 27, 2026 9:16 PM | Aditya369 News

పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు.. ‘ఓజీ 2’ నుంచి థమన్ మాస్ సర్‌ప్రైజ్..!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. సుజీత్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ ‘ఓజీ’ యూనివర్స్ ఇప్పుడు మరింత విస్తరించబోతోంది. ‘ఓజీ 2’ కోసం స్టోరీ సిట్టింగ్స్ పూర్తవగా, తాజాగా మేకర్స్ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు.

‘ది ఆరిజిన్ ఆఫ్ ఫైర్’ పేరుతో విడుదలైన ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో రిలీజ్ అయిన ఈ మ్యూజిక్ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

‘ఓజీ’ విడుదలైనప్పుడు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం తెలిసిందే. పవన్ కళ్యాణ్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ అవతారం, సుజీత్ టేకింగ్, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కలిసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పుడు అదే మేజిక్‌ను ‘ఓజీ 2’లో మరింత భారీగా చూపించేందుకు టీమ్ సిద్ధమవుతోంది.

“Every Fire Has An Origin… This One Changed Everything” అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్ ఇప్పటికే అభిమానుల్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ‘ఓజీ 2’ అనౌన్స్‌మెంట్ తర్వాత వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. ఇప్పుడు అదే థీమ్‌ను పూర్తి ట్రాక్‌గా విడుదల చేయడంతో సోషల్ మీడియా మొత్తం ‘ఓజీ’ మేనియాతో మార్మోగుతోంది.

సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ మరోసారి తన మార్క్ చూపించాడు. హెవీ బీట్‌లు, పవర్‌ఫుల్ డ్రమ్స్, గూస్‌బంప్స్ తెప్పించే ఆర్కెస్ట్రేషన్‌తో ‘ది ఆరిజిన్ ఆఫ్ ఫైర్’ ట్రాక్ అభిమానులను ఫిదా చేస్తోంది. ఈ మ్యూజిక్ వింటుంటేనే ‘ఓజీ 2’ థియేటర్లలో ఏ రేంజ్‌లో విధ్వంసం సృష్టించబోతుందో ఊహించుకోవచ్చు.

రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఈ ట్రాక్ యూట్యూబ్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. పవన్ కళ్యాణ్ ఎలివేషన్లకు పర్ఫెక్ట్‌గా సరిపోయే ఈ థీమ్‌ను అభిమానులు రిపీట్ మోడ్‌లో వింటున్నారు.

మొత్తానికి, ‘ఓజీ’ యూనివర్స్ మ్యాజిక్ ఇంకా ఏమాత్రం తగ్గలేదని ఈ మ్యూజిక్ మరోసారి నిరూపించింది. ఇక ‘ఓజీ 2’ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? రిలీజ్ ఎప్పుడు? బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కొత్త రికార్డులు సృష్టిస్తుంది? అనే ఆసక్తి అభిమానుల్లో రోజురోజుకూ పెరుగుతోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు