Search
Close this search box.

  జైలర్ 2లో హృతిక్ రోషన్ ఎంట్రీ.. రజనీ ఫ్యాన్స్‌కు పూనకాలు..!

June 12, 2026 10:24 PM | Aditya369 News

జైలర్ 2లో హృతిక్ రోషన్ ఎంట్రీ.. రజనీ ఫ్యాన్స్‌కు పూనకాలు..!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి రజనీ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న 'జైలర్ 2'పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్.. 'జైలర్ 2'లో పవర్‌ఫుల్ కేమియో పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో అటు రజనీ అభిమానులు, ఇటు హృతిక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

గత కొన్ని వారాలుగా చిత్ర బృందంతో జరిగిన చర్చల అనంతరం హృతిక్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఆయన పాత్ర సినిమాకు అత్యంత కీలకంగా ఉండబోతోందని టాక్. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో సాగే ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

జూన్ 22, 23 తేదీల్లో చెన్నైలో హృతిక్ రోషన్‌పై ప్రత్యేక షెడ్యూల్ నిర్వహించనున్నారట. షూటింగ్‌కు ముందు ఆయన కోసం డిఫరెంట్ లుక్ టెస్ట్‌లు నిర్వహించి, ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని సరికొత్త గెటప్‌ను ఫైనల్ చేయనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ కాంబినేషన్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. 1986లో విడుదలైన హిందీ చిత్రం 'భగవాన్ దాదా'లో బాలనటుడిగా హృతిక్ రోషన్ నటించగా, అందులో రజనీకాంత్ కీలక పాత్ర పోషించారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు స్టార్స్ మళ్లీ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతుండటం సినీ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో ఎస్.జే. సూర్య, రమ్యకృష్ణ, విద్యా బాలన్, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

మొదటి భాగంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్ నటుల కేమియోలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పుడు 'జైలర్ 2'లో హృతిక్ రోషన్ ఎంట్రీతో ఈ సినిమాపై హైప్, బిజినెస్ రేంజ్ మరింత పెరిగాయి.

మరి రజనీకాంత్ స్టైల్‌కు.. హృతిక్ రోషన్ స్వాగ్ తోడైతే వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందో చూడాలి. ఒక విషయం మాత్రం ఖాయం... 'జైలర్ 2' ఇప్పుడు ఇండియన్ సినీ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్‌లో ఒకటిగా మారిపోయింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి రజనీ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ‘జైలర్ 2’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్.. ‘జైలర్ 2’లో పవర్‌ఫుల్ కేమియో పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో అటు రజనీ అభిమానులు, ఇటు హృతిక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

గత కొన్ని వారాలుగా చిత్ర బృందంతో జరిగిన చర్చల అనంతరం హృతిక్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఆయన పాత్ర సినిమాకు అత్యంత కీలకంగా ఉండబోతోందని టాక్. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో సాగే ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

జూన్ 22, 23 తేదీల్లో చెన్నైలో హృతిక్ రోషన్‌పై ప్రత్యేక షెడ్యూల్ నిర్వహించనున్నారట. షూటింగ్‌కు ముందు ఆయన కోసం డిఫరెంట్ లుక్ టెస్ట్‌లు నిర్వహించి, ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని సరికొత్త గెటప్‌ను ఫైనల్ చేయనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ కాంబినేషన్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. 1986లో విడుదలైన హిందీ చిత్రం ‘భగవాన్ దాదా’లో బాలనటుడిగా హృతిక్ రోషన్ నటించగా, అందులో రజనీకాంత్ కీలక పాత్ర పోషించారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు స్టార్స్ మళ్లీ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతుండటం సినీ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో ఎస్.జే. సూర్య, రమ్యకృష్ణ, విద్యా బాలన్, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

మొదటి భాగంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్ నటుల కేమియోలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పుడు ‘జైలర్ 2’లో హృతిక్ రోషన్ ఎంట్రీతో ఈ సినిమాపై హైప్, బిజినెస్ రేంజ్ మరింత పెరిగాయి.

మరి రజనీకాంత్ స్టైల్‌కు.. హృతిక్ రోషన్ స్వాగ్ తోడైతే వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందో చూడాలి. ఒక విషయం మాత్రం ఖాయం… ‘జైలర్ 2’ ఇప్పుడు ఇండియన్ సినీ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్‌లో ఒకటిగా మారిపోయింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు