Search
Close this search box.

  సినిమా పరిశ్రమలో పని గంటలపై నటి కృతి శెట్టి కీలక వ్యాఖ్యలు

కృతి శెట్టి, సినీ రంగంలో రోజుకు 8 గంటల పని విధానంపై జరుగుతున్న చర్చకు సంబంధించి తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారు. అందరికీ ఒకేరకమైన నియమాలు సరిపోవని, పని గంటలనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆమె అన్నారు.

తాను డైరెక్టర్ అనుకూల యాక్టర్ (Director-friendly Actor) అని కృతి శెట్టి వెల్లడించారు. తన శక్తి ఉన్నంతవరకు, అవసరమైతే 24 గంటలు పనిచేయడానికి కూడా సిద్ధమని, దర్శకుడు కోరితే 13 గంటలైనా సెట్‌లో ఉంటానని స్పష్టం చేశారు. కొత్త తమిళ చిత్రం ‘వా వాతియార్’ ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

పని గంటల విషయంలో సమస్యలు రాకుండా ఉండాలంటే, ముందస్తు చర్చలే ఉత్తమ పరిష్కారమని ఆమె సూచించారు. ఒక నటి ఎన్ని గంటలు పనిచేయగలదో దర్శకనిర్మాతలకు ముందే తెలిస్తే, దానికి అనుగుణంగా వారు షూటింగ్ ప్రణాళిక వేసుకుంటారని లేదా మరో నటిని ఎంచుకుంటారని ఆమె అభిప్రాయపడ్డారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు