Search
Close this search box.

  గ్యాంగ్‌స్టర్ల దాడి తర్వాత దిశా పటానీ తండ్రికి గన్ లైసెన్స్ మంజూరు

బాలీవుడ్ నటి దిశా పటానీ తండ్రి, రిటైర్డ్ డీఎస్పీ అయిన జగదీశ్ పటానీకి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా యంత్రాంగం ఆయుధ లైసెన్స్‌ను మంజూరు చేసింది. బరేలీలోని వారి పూర్వీకుల నివాసంపై ఇటీవల గ్యాంగ్‌స్టర్ల ముఠా దాడికి పాల్పడటంతో, ఆయన వ్యక్తిగత భద్రత కోసం ఈ లైసెన్స్ జారీ చేయబడింది. సెప్టెంబర్ 11, 12 తేదీల్లో మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు పటానీ ఇంటిపై సుమారు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో గోల్డీ బ్రార్, రోహిత్ గొడారా గ్యాంగ్‌కు చెందిన సభ్యులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.

కాల్పుల ఘటన తర్వాత, జగదీశ్ పటానీ తన భద్రత కోసం ఆయుధ లైసెన్స్ మంజూరు చేయాలని కోరుతూ జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. ఈ విషయంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా స్పందించి, ఆయనకు తగిన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అన్ని లాంఛనాలు మరియు నిబంధనలను పరిశీలించిన అనంతరం, జగదీశ్ పటానీకి రివాల్వర్ లేదా పిస్టల్ కోసం లైసెన్స్ జారీ చేసినట్టు బరేలీ జిల్లా మేజిస్ట్రేట్ అవనీశ్ సింగ్ వెల్లడించారు.

ఈ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో, దాడికి పాల్పడిన నిందితుల్లో ఇద్దరిని సెప్టెంబర్ 17న ఘజియాబాద్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో యూపీ, హర్యానా, ఢిల్లీ పోలీసుల సంయుక్త బృందం మట్టుబెట్టింది. దిశా పటానీ ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ వంటి భారీ చిత్రాలలో నటిస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు