Search
Close this search box.

  శివుడు పిలిస్తే అన్నీ వదిలేసి కాశీకి వెళ్తా: రేణు దేశాయ్ ఆధ్యాత్మిక పోస్ట్ వైరల్

సినీ నటి రేణు దేశాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆమె ఇటీవల కాశీ క్షేత్రాన్ని సందర్శించి, ఆధ్యాత్మిక భావాలు నిండిన ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. “శివుడు పిలిచినప్పుడు మీరు అన్నీ వదిలేసి కాశీకి వెళ్తారు. నేను కూడా అంతే, శివుడు పిలిచినప్పుడు అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను” అని ఆమె చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

కాశీ క్షేత్ర పాలకుడైన కాల భైరవుడి జయంతి సందర్భంగా రేణు దేశాయ్ కాశీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని ఫోటోలను పంచుకుంటూ, ఆధ్యాత్మిక సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో, “కాల భైరవ జయంతి రోజున మనం రక్షణ కోరుకోకూడదు. మనమే రక్షకుడిగా మారాలి. కాల భైరవుడు మీ వెంట నడుస్తూ మిమ్మల్ని నడిపిస్తాడు” అని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆమె ఆధ్యాత్మిక చింతనను, శివుడిపై ఆమెకున్న అచంచలమైన భక్తిని తెలియజేస్తున్నాయి.

గతంలో రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి మాట్లాడినప్పటికీ, ఆ తర్వాత సన్యాసం తీసుకుంటానని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ సమయంలో ఆమె నిర్ణయంపై పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు కాశీ, శివుడి గురించి ఆమె పెట్టిన తాజా పోస్ట్ చూస్తుంటే, ఆమె తన సన్యాస నిర్ణయానికే కట్టుబడి ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రేణు దేశాయ్ తన పిల్లలు అకీరా, ఆద్యలకు పూర్తి సమయం కేటాయిస్తూ, తరచుగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ, వారికి భారతీయ సంస్కృతి, సంప్రదాయాల విలువను నేర్పుతున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు