గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో శరవేగంగా పాల్గొంటున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామా మార్చి 27న విడుదల కానుంది. అయితే, తాజా సమాచారం ప్రకారం… ‘పెద్ది’ షూటింగ్ పూర్తయిన వెంటనే చరణ్ సినిమాలకు కొంతకాలం బ్రేక్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది. చరణ్ భార్య ఉపాసన ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు, వారికి కవల పిల్లలు జన్మించబోతున్నారనే వార్తల నేపథ్యంలో, డెలివరీ సమయంలో కుటుంబంతో గడపడానికి చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రామ్‌చరణ్, ‘మగధీర’ తో బ్లాక్‌బస్టర్ అందుకుని, ‘రంగస్థలం’ తో నటుడిగా తనపై వచ్చిన విమర్శలన్నింటికీ చెక్ పెట్టారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా గ్రామీణ నేపథ్యం, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ‘చికిరి.. చికిరి’ అనే ఫస్ట్ సింగిల్ పాట విపరీతమైన స్పందనతో యూట్యూబ్‌లో ట్రెండ్ సెట్ చేసింది.
‘పెద్ది’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా కూడా ఈ బ్రేక్ కారణంగా కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసి కొంతమంది ఫ్యాన్స్ నిరాశ చెందినప్పటికీ, చాలామంది చరణ్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. కెరీర్‌తో పాటు కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలనే చరణ్ నిర్ణయం మిగతావారికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడుతున్నారు. గతంలో క్లీంకార పుట్టినప్పుడు కూడా చరణ్ ఇలాగే సినిమాలకు గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే.









