స్టార్ హీరో రానా దగ్గుబాటి త్వరలో తండ్రి కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన సతీమణి మిహిక బజాజ్ గర్భవతి అని, త్వరలోనే దగ్గుబాటి కుటుంబంలోకి కొత్త సభ్యుడు రాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ, రానా దంపతులు వాటిని ఖండించారు. అయితే, ఇప్పుడు ఈ ప్రచారం మరోసారి తెరపైకి రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈసారి ఈ వార్త నిజమేనని, త్వరలోనే అధికారికంగా ప్రకటించాలని వారు భావిస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రచారంపై రానా గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇంతవరకు స్పందించలేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.









