టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న యాక్షన్అడ్వెంచర్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో భారీ స్థాయిలో షూటింగ్ జరుపుకుంటోంది..
యూనిట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేశ్ బాబు పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు ఆయన కెరీర్లో ఎప్పుడూ చూడని అవతారాన్ని చూడబోతున్నామని టీమ్ చెబుతోంది. ఈ సినిమా మహేశ్ కెరీర్‌కి గేమ్ చేంజర్ అవుతుందని టాక్ గట్టిగా వినిపిస్తోంది..
తాజా అప్డేట్ ప్రకారం, రాజమౌళి ఈ సినిమాలో ఓ హై వోల్టేజ్ ఫోక్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. సంగీత మాంత్రికుడు ఎం.ఎం. కీరవాణి ఈ పాటకు ఎనర్జిటిక్ బీట్ ఇచ్చారు. స్టెప్స్ డిజైన్ చేయడానికి టాప్ కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఎంపికయ్యారు..ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఈ పాటలో మహేశ్ బాబు సరసన బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా స్క్రీన్ షేర్ చేయబోతున్నారు. ఈ జంట కాంబినేషన్లో చూడబోయే డ్యాన్స్ స్టెప్స్, విజువల్స్ థియేటర్స్‌లో ఫ్యాన్స్‌కు పండుగలా ఉంటాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి..ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. రాజమౌళి శైలిలో ఉన్న ఎమోషనల్ డెప్త్, అడ్వెంచర్ థ్రిల్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమా నిజంగా ఒక విజువల్ ట్రీట్ కానుందని టాక్.ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, నవంబర్‌లో సినిమా నుంచి భారీ అప్డేట్స్ రాబోతున్నాయి..









