Search
Close this search box.

  కల్కి 2 లో దీపిక ప్లేస్ లో దేవాసేన..?

టాలీవుడ్‌లో స్టార్ హీరోగా అగ్రస్థానంలో నిలిచిన వారిలో ప్రభాస్ ఒకరు. కృష్ణంరాజు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ప్రభాస్, బాహుబలి విజయంతో దేశవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఆయన నటించిన ప్రతి సినిమా కూడా భారీ స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

 

కల్కి 2లో అనుష్క ఎంట్రీ?

 

గత సంవత్సరం విడుదలైన కల్కి సినిమాతో ప్రభాస్ మరోసారి సెన్సేషన్ సృష్టించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ భారీ స్థాయిలో నిర్మించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తూ చిత్రబృందం ముందుకు వెళ్తోంది. అయితే ఇందులో హీరోయిన్ విషయంలో పెద్ద మార్పు జరగనుందని టాక్ వినిపిస్తోంది. మొదటి భాగంలో సుమతి పాత్రలో దీపికా పదుకొనే నటించగా, సీక్వెల్‌లో ఆమెను రీప్లేస్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

 

సుమతిగా అనుష్క?

 

దీపికా తప్పుకున్న నేపథ్యంలో, ఈ పాత్రలో అనుష్కను తీసుకునే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో ఈ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. నిజంగానే అనుష్క సుమతిగా వస్తే, ప్రేక్షకులకు ఇది స్పెషల్ ట్రీట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

మళ్లీ తెరపైకి ప్రభాస్–అనుష్క జంట

 

అనుష్క పేరు వినిపించగానే, మరోసారి ప్రభాస్–అనుష్క పెళ్లి గాసిప్స్ ఊపందుకున్నాయి. గతంలో కూడా వీరిద్దరి పెళ్లి గురించి అనేక రకాల వార్తలు వచ్చినా, ఇద్దరూ వాటిని ఖండిస్తూ తాము కేవలం మంచి స్నేహితులమని స్పష్టం చేశారు. అయితే మిర్చి, బాహుబలి చిత్రాల్లో ఈ జంట స్క్రీన్ మీద మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కల్కి 2లో మళ్లీ ఈ కాంబినేషన్ కనిపిస్తుందనే అంచనాలు అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి.

 

మరి నిజంగా అనుష్క ఈ ప్రాజెక్టులో భాగం అవుతుందా? లేక ఇవి కేవలం రూమర్స్ మాత్రమేనా? అనే క్లారిటీ కోసం అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు