బాలీవుడ్ – టాలీవుడ్ మధ్య గీతలు చెదిరిపోయాయి. హిందీ స్టార్ హీరోలు వరుసగా తెలుగు సినిమాల్లో కనిపిస్తున్నారు. కల్కి 2898 ADలో అమితాబ్ బచ్చన్ అశ్వథ్థామ పాత్రలో మెప్పించగా, ఇప్పుడు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా టాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది..
అభిషేక్ తొలి తెలుగు సినిమా కూడా చిన్నది కాదు. ఆయన ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ఫౌజీలో కీలక పాత్రలో నటించనున్నారట. స్వాతంత్ర్యానికి ముందు నాటి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ ఇప్పటికే షూటింగ్‌లో బిజీగా ఉంది.
మేకర్స్ ఒక ప్రత్యేక పాత్రకు అభిషేక్ సరైన ఎంపిక అని భావించి, ఆయనను సంప్రదించినట్లు టాక్. కథ, పాత్ర రెండూ నచ్చడంతో అభిషేక్ ఆసక్తి చూపారట. ప్రస్తుతం కమర్షియల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం
ఇప్పటివరకు బాలీవుడ్‌కే పరిమితమైన అభిషేక్ బచ్చన్, ఫౌజీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే, ఆయనకు సౌత్ మార్కెట్‌తో పాటు హిందీ వెర్షన్ ద్వారానూ పెద్ద స్థాయి గుర్తింపు దక్కే అవకాశముంది.
ఇక ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్‌నే గట్టి అంచనాలు సృష్టిస్తుండగా, ఇందులో అభిషేక్ ఎంట్రీ నిజమైతే సినిమా హైప్ మరింత రెట్టింపు కానుంది. అభిమానులు మాత్రం అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.









