కన్నడ డైరెక్టర్ అశ్విన్ కుమార్ తీసిన మహావతార్ నరసింహా సినిమాకు ఎలాంటి అంచనాలు లేకపోయినా, విడుదలైన వెంటనే బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. యానిమేషన్ రూపంలో నరసింహుడి ఉగ్రరూపం చూసిన ప్రేక్షకులు థియేటర్లలో కేకలు వేశారు.
రూ.40 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ చిత్రం, మొదటి 8 రోజుల్లోనే రూ.60 కోట్ల వసూళ్లు సాధించింది. లాంగ్ రన్లో అయితే రూ.300 కోట్లకు పైగా రాబట్టి, ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేషన్ మూవీగా చరిత్ర సృష్టించింది.
ఈ సంచలన చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. సెప్టెంబర్ 19 మధ్యాహ్నం 12.30 గంటలకు నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది.
థియేటర్లలో ఈ స్థాయి విజయాన్ని అందుకున్న మహావతార్ నరసింహా, ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.









