గత ఏడాది సంక్రాంతి సందర్భంగా వచ్చిన హనుమాన్ బ్లాక్‌బస్టర్ హిట్‌తో హీరో తేజా సజ్జా స్టార్ రేంజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత ఆయన చేసే ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మొదట జై హనుమాన్ రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వలన వాయిదా పడింది. దాంతో తేజా కొత్త కాన్సెప్ట్ మూవీ మిరాయ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు వచ్చిన స్పందన అద్భుతంగా ఉంది. “ఇంతకాలం తర్వాత ఒక మంచి క్వాలిటీ సినిమా చూడబోతున్నాం” అనే నమ్మకం కలిగించింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
నాని రిజెక్ట్ చేసిన సినిమా..!
మిరాయ్ కథను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మూడేళ్ల క్రితమే సిద్ధం చేశాడు. అప్పట్లో సినిమాటోగ్రాఫర్‌గా ఉన్న ఆయనతో డైరెక్టర్‌గా కలిసి పనిచేయడానికి స్టార్ హీరోలు వెనుకడుగువేశారు. కానీ నేచురల్ స్టార్ నాని మాత్రం ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే రెమ్యూనరేషన్ విషయంలో సమస్య తలెత్తడంతో నాని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.
తర్వాత కార్తీక్ మళ్లీ తన సినిమాటోగ్రఫీ పనుల్లో బిజీ అయ్యాడు. ఇదే సమయంలో హనుమాన్ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన తేజా సజ్జా ఈ కథ విన్న వెంటనే ఓకే చెప్పాడు. ఫలితంగా మిరాయ్ ఇప్పుడు థియేటర్లలో ప్రేక్షకులను పలుకరించింది.
పబ్లిక్ రివ్యూ – బ్లాక్‌బస్టర్ టాక్
ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా విజువల్స్‌పై ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. థియేటర్‌లో ఓ పెద్ద సినిమా చూసిన అనుభూతి కలుగుతోందని టాక్.
నటనలో తేజా సజ్జా – మంచు మనోజ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని ప్రేక్షకులు చెబుతున్నారు. కొత్తగా అనిపించే కథ, సన్నివేశాలకు తగ్గట్టు నడిచే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకి హైలైట్.
అయితే కొంత లెంగ్త్ ఎక్కువ కావడం, కామెడీ పెద్దగా క్లిక్ కాకపోవడం, విలన్ ఫ్లాష్‌బ్యాక్‌లో మిస్ అయిన ఎమోషన్ మాత్రమే మైనస్ పాయింట్స్‌గా వినిపిస్తున్నాయి.
మిగతా అన్నీ బాగున్నాయనే టాక్‌తో మిరాయ్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ఎంత భారీ కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి..!









