డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి ఫ్లాప్‌ల తర్వాత మరోసారి సరికొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తాజాగా ప్రకటించిన చిత్రం “బెగ్గర్”, ఇందులో హీరోగా విజయ్ సేతుపతి నటించనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం సినిమా కోసం ఒక భారీ ఎంట్రీ సీక్వెన్స్ షూట్ చేయడానికి స్పెషల్ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సన్నివేశంలో విజయ్ సేతుపతి పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడట. ప్రత్యేకంగా ఆయనకోసమే ఈ ఎంట్రీ సీన్‌ను డిజైన్ చేశారని టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సీక్వెన్స్‌లో ఇతర ప్రధాన నటీనటులు కూడా భాగమవుతారని తెలుస్తోంది. ఇది ఒక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ అయ్యే అవకాశముంది.
గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన “డబుల్ ఇస్మార్ట్” ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా బలమైన కంటెంట్ లేకపోవడం వల్ల నిరాశ వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో పూరి, విజయ్ సేతుపతితో కలసి ఎలాంటి కథను తెరపైకి తీసుకువస్తాడో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది..









