పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా, దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “ఓజీ”పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమాకి ఉన్న హైప్‌ను మరింత పెంచేలా ఇప్పుడు ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 20న నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రత్యేకత ఏమిటంటే—ఈసారి ఈవెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోనే భారీ స్థాయిలో చేయనున్నారట. దీంతో పవర్‌స్టార్ అభిమానులకు మరో సెన్సేషనల్ ట్రీట్ రాబోతుందని చెప్పవచ్చు..
ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా, నిర్మాణ బాధ్యతలు ప్రముఖ నిర్మాత డివివి దానయ్య చేపట్టారు..









