ఇండియన్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం అనేక భారీ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నప్పటికీ, వాటిలో గ్లోబల్ లెవెల్‌లో దృష్టిని ఆకర్షించే కొన్ని మాత్రమే ఉన్నాయి. అలాంటి వాటిలో సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న మాసివ్ ప్రాజెక్ట్ ఒకటి..
ఇటీవల కెన్యా షెడ్యూల్ నుంచి ఆసక్తికరమైన అప్‌డేట్స్ బయటకు వచ్చాయి. ఇక ఈ ఏడాది నవంబర్‌లో ప్రత్యేక ట్రీట్ ఇవ్వబోతున్నారని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అప్పటివరకు ఫస్ట్ లుక్ మాత్రమే వస్తుందని అనుకున్నప్పటికీ, ఇప్పుడు దానితో పాటు ఫస్ట్ గ్లింప్స్, అలాగే రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కూడా ప్లాన్‌లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
అందుకు రాజమౌళి ఇంతకు ముందు ఏ సినిమాకి చేయని విధంగా స్పెషల్ ప్లానింగ్ చేస్తున్నారని సమాచారం. దీంతో ఈ మూవీపై ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక చర్చ జరుగే అవకాశం ఉంది. మొత్తానికి నవంబర్‌కి సంబంధించిన అప్‌డేట్ గ్లోబల్‌గా హైప్ క్రియేట్ చేయడం ఖాయం అని చెప్పొచ్చ..









