Search
Close this search box.

  మెగాస్టార్ బర్త్ డే కు ఫాన్స్ కు మెగా ట్రీట్ రెడీ..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష – ఆశిక రంగనాథ్ హీరోయిన్లుగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫాంటసీ ఎంటర్‌టైనర్ “విశ్వంభర”పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర టీజర్‌కి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ లభించింది.

మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా, అంటే ఆగస్టు 22న టీజర్‌ను విడుదల చేయనున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆ స్పెషల్ డేను మెగా అభిమానులు మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు.

ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అంతేకాకుండా, టీజర్‌ విడుదలతో పాటు సినిమా రిలీజ్ డేట్‌ కూడా ప్రకటించే అవకాశముందని టాక్ వినిపిస్తోంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు