‘పుష్ప-1’లో సమంత చేసిన సెన్సేషనల్ స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావా…’ ఎప్పుడూ ఎక్కడో ఒక వేడుకలో, ఈవెంట్‌లో వినిపిస్తూనే ఉంటుంది. ఆ పాట, సమంత చేసిన స్టెప్స్ ప్రజల మదిలో చెరగని ముద్ర వేసి, ఐకానిక్ నెంబర్‌గా నిలిచాయి.
ఇక రామ్ చరణ్–సమంత జంటగా నటించిన రంగస్థలం బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, ‘పెద్ది’లో కూడా ఈ జోడీని మరోసారి స్క్రీన్‌పై చూడాలని దర్శకుడు బుచ్చిబాబు బలంగా ప్లాన్ చేస్తున్నారట. అందుకే సినిమాలో ఓ మాస్ స్పెషల్ సాంగ్ కోసం సమంతను సంప్రదించారని టాక్. బుచ్చిబాబు ఇంకా అధికారికంగా చెప్పకపోయినా, సమంత మాత్రం ఈ ఆఫర్‌కి వెంటనే ‘ఊ’ అనేసిందట.
‘పెద్ది’లో రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ రొమాన్స్ చేయనుండగా, జగపతి బాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేంద్రు వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ పాన్ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్‌కి సంగీతం మాస్ట్రో ఏఆర్ రహమాన్, కెమెరా మ్యాజిక్ రత్నవేలు, ఎడిటింగ్ నవీన్ నూలి అందిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఐదు భాషల్లో రిలీజ్ కానుంది. ఫస్ట్ గ్లింమ్స్‌లోనే వచ్చే ఏడాది మార్చి 27న విడుదల అవుతుందని ధృవీకరించారు..