Search
Close this search box.

  “ఓజీ” నుండి త్వరలో క్రేజీ ట్రీట్..!

July 28, 2025 10:30 PM | Aditya369 News

“ఓజీ” నుండి త్వరలో క్రేజీ ట్రీట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడిప్పుడే ‘హరిహర వీరమల్లు’ ప్రభావం నుంచి బయటపడుతున్న తరుణంలో, ఆయన నటిస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘ఓజీ’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్‌తో పాటు సినీప్రేమికులు కూడా ఈ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఆయన మాస్ అవతార్‌ను మరోసారి వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక తాజాగా, ఈ సినిమా ప్రమోషన్‌ ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు పూర్తి చేసుకున్నారు. అందులో భాగంగా, ఆగస్టు 1న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ పాటను కోలీవుడ్ స్టార్ శింబు ఆలపించగా, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌.థమన్ మాస్ బీట్‌తో కంపోజ్ చేశాడట.

ఈ సినిమాకు యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. తనదైన స్టైల్ టేకింగ్‌తో పవన్ క్యారెక్టర్‌ను మరింత పవర్‌ఫుల్‌గా ఆవిష్కరించనున్నాడని టాక్. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడిప్పుడే ‘హరిహర వీరమల్లు’ ప్రభావం నుంచి బయటపడుతున్న తరుణంలో, ఆయన నటిస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘ఓజీ’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్‌తో పాటు సినీప్రేమికులు కూడా ఈ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఆయన మాస్ అవతార్‌ను మరోసారి వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక తాజాగా, ఈ సినిమా ప్రమోషన్‌ ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు పూర్తి చేసుకున్నారు. అందులో భాగంగా, ఆగస్టు 1న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ పాటను కోలీవుడ్ స్టార్ శింబు ఆలపించగా, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌.థమన్ మాస్ బీట్‌తో కంపోజ్ చేశాడట.

ఈ సినిమాకు యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. తనదైన స్టైల్ టేకింగ్‌తో పవన్ క్యారెక్టర్‌ను మరింత పవర్‌ఫుల్‌గా ఆవిష్కరించనున్నాడని టాక్. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు…

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు