ఇండియన్ సినిమాల్లో భారీ అంచనాలతో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ SSMB 29 గురించీ ఇంకా ఎటువంటి అధికారిక అప్‌డేట్ రాలేదైనా, మేకింగ్ వర్క్ సైలెంట్‌గా జరుగుతున్నట్టు టాక్. సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధీరుడు రాజమౌళి కలయికలో వస్తున్న ఈ భారీ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది..ప్రస్తుతం రాజమౌళి ఈ చిత్రానికి తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు. బాహుబలి సినిమా రీ-రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి, మరోవైపు మహేష్ తన కుటుంబంతో కలిసి శ్రీలంక టూర్ వెళ్లాడు. అదే సమయంలో మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ తన తాజా చిత్రం సర్జమీన్ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడాడు.ఈ సందర్భంలో పృథ్విరాజ్ – “SSMB 29 ఒక మామూలు సినిమా కాదు. ఇది ఇప్పటి వరకు ఎవరూ ట్రై చేయని రీతిలో మాస్ అండ్ క్లాస్ ను మిక్స్ చేసి రూపొందుతున్న మాస్టర్ పీస్. ఇలాంటివి తీయడంలో రాజమౌళికి మించినవారు లేరు. ఆయనతో కలిసి పనిచేయడం నాకు గర్వంగా ఉంది. ఇది అంచనాలకు మించిన చిత్రం అవుతుంది” అని అన్నాడు.పృథ్విరాజ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాటలతో సినిమా మీద క్రేజ్ మరింత పెరిగింది. మహేష్ – రాజమౌళి కాంబోలో వస్తున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లనుంది..









