బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ విడుదలకు టైమ్ పడుతోంది. యష్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు..ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టిన మేకర్స్, తాజాగా ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. జూలై 25న ‘వార్ 2’ ట్రైలర్ విడుదల కానుంది..ఇక ట్రైలర్ నిడివి 2 నిమిషాలు 39 సెకన్లు కాగా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) U/A సర్టిఫికేట్ (16+) మంజూరు చేసింది. ఈ ట్రైలర్‌తో సినిమా పైన అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని యూనిట్ భావిస్తోంది..ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మళ్లీ కబీర్ పాత్రలో అదరగొట్టబోతుండగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రతినాయకుడిగా బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. కియారా అద్వానీ ఓ కీలక పాత్రలో కనిపించనుండగా, ఇది యష్‌రాజ్ స్పై యూనివర్స్‌లో ఆరవ సినిమా కావడం విశేషం.









