ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా ‘హరి హర వీరమల్లు’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తొలి భాగం ‘స్వోర్డ్ vs స్పిరిట్’ జూలై 24న విడుదల కానున్న సందర్భంగా, మంగళగిరిలో విలేఖరులతో మాట్లాడిన పవన్ కల్యాణ్ పార్ట్ 2 గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతున్నట్లు తెలిపారు పవన్. రెండో భాగం షూటింగ్ ఇప్పటికే 20-30 శాతం పూర్తయిందని చెప్పారు. అయితే పార్ట్ 2 పూర్తిగా రూపొందించాలంటే తగిన బడ్జెట్, తనకు లభించే సమయం ఆధారపడుతుందన్నారు. “దీనికి భగవంతుడి ఆశీస్సులు కూడా అవసరం,” అని పవన్ పేర్కొన్నారు..కథ గురించి మాట్లాడుతూ, ఇది కోహినూర్ వజ్రాన్ని తిరిగి తెచ్చేందుకు ఓ వీరుడు చేసే విస్మయకర యాత్ర అని తెలిపారు. ఇది పూర్తిగా కల్పిత కథ అని స్పష్టం చేశారు. అలాగే సర్వాయి పాపన్న జీవితకథతో ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని ఖరాఖండీగా చెప్పారు..









