హాలీవుడ్ విజువల్ మాస్టర్ జేమ్స్ కామెరూన్ రూపొందించిన అవతార్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి భాగంలో పాండోరా గ్రహం, రెండవ భాగంలో నీటి లోకాన్ని చూపించి, ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్‌ను మంత్రముగ్దుల్ని చేసిన కామెరూన్.. ఇప్పుడు మూడో భాగం ‘అవతార్ 3: ఫైర్ అండ్ యాష్’ తో మరో అద్భుత ప్రయాణానికి సిద్ధమవుతున్నారు..ఈ సినిమా డిసెంబర్ 19, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ‘ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ థియేట్రికల్ రిలీజ్ సందర్భంగా, అవతార్ 3 ట్రైలర్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా ప్రేక్షకులకు చూపించనున్నారు..మొదటి పార్ట్‌లో భూమి వర్సెస్ పాండోరా, రెండో పార్ట్‌లో సముద్ర తలపోరుల నేపథ్యంలో కథ సాగగా, మూడో పార్ట్‌కి సంబంధించిన కాన్సెప్ట్ మరింతగా డార్క్ టర్న్ తీసుకోనుందని తెలుస్తోంది. ఈసారి అగ్ని తత్వం ఆధారంగా కథనం నడవనుంది..ఈ భాగంలో న’వి తెగల్లో ఒకటైన అగ్ని తెగ యాష్ పీపుల్ (Ash People) ప్రధాన ప్రతినాయకులుగా ఉత్పత్తి అవుతున్నారు. వారి నాయకురాలు వరంగ్ (Varang) పేరుతో ఓ శక్తిమంతమైన, గట్టిపడు విరోధిగా తెరపై కనిపించనుందని సమాచారం. ఇది అవతార్ ఫ్రాంచైజీలో మొదటి సారి న’వి కమ్యూనిటీ నుంచి వస్తున్న విలన్ పాత్ర కావడం విశేషం.ఈసారి జేక్ సులీ కుటుంబం యాష్ తెగతో చాకచక్యమైన యుద్ధానికి దిగనుంది. ఇది పాండోరా లోకాన్ని మరో కోణంలో చూపిస్తుందని డైరెక్టర్ కామెరూన్ హింట్ ఇచ్చారు. ఇందులో తీవ్రమైన యాక్షన్, భావోద్వేగాల మిళితం, పాత్రల అభివృద్ధి, కథా గాథలో లోతైన మలుపులు ఉండబోతున్నాయంటూ ఎంపైర్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.









