మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్గా నటిస్తోన్న ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫాంటసీ జానర్లో చిరు చాలా కాలం తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో, ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తుండగా, సంగీతం ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు. నిర్మాణ బాధ్యతలు యూవీ క్రియేషన్స్ తీసుకుంది.
గత ఏడాది దసరా సందర్భంగా విడుదలైన గ్లింప్స్ వీడియోపై పలువురు ట్రోల్స్ చేయడం గుర్తుండే ఉంటుంది. విజువల్స్, గ్రాఫిక్స్, ప్రొడక్షన్ క్వాలిటీపై నెగటివ్ కామెంట్స్ రావడంతో, టీజర్‌పై కొంత విమర్శనాత్మకత నెలకొన్నది..అయితే తాజాగా డైరెక్టర్ వశిష్ఠ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. “ఈసారి వచ్చే ట్రైలర్ మాత్రం ట్రోల్స్‌కి పకడ్బందీ సమాధానం అవుతుంది. అప్పట్లో విమర్శించినవాళ్లకే ఇప్పుడు సినిమా మీద విశ్వాసం కలుగుతుంది,” అని ఆయన ధీమాగా వెల్లడించారు..ఈ వ్యాఖ్యలతో పాటు, ఈసారి ట్రైలర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజువల్స్, కంటెంట్ పరంగా ట్రైలర్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉండబోతోందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.









