పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై రోజుకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వస్తోంది. ఇప్పటికే శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుండగా, తాజాగా మరో హీరోయిన్ కూడా సినిమాలో భాగమవుతుందనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇప్పటికే ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, రాశి ఖన్నా ఈ ప్రాజెక్ట్‌లో రెండో హీరోయిన్గా జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్‌తో రాశి ఖన్నా కాంబినేషన్లో సినిమా రానున్నట్టు పలు సార్లు వార్తలు వచ్చినా, అవి సెట్ కాలేదు. కానీ ఈసారి మాత్రం ఈ కలయిక కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ బలంగా కనిపిస్తోంది..పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉండటం పెద్ద విశేషం కాదు. గతంలో వచ్చిన అనేక చిత్రాల్లో అలాంటి సెటప్ చూశాం. దీంతో రాశి ఖన్నా ఎంట్రీపై అధికారిక ప్రకటన వెలువడితే, అభిమానుల్లో హైప్ మరో లెవెల్‌కు వెళ్లేలా ఉంది. పవన్ – రాశి మధ్య స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుందన్నది మాత్రం ఇప్పుడే హాట్ టాపిక్‌గా మారింది…రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, ఈసారి మాస్ బీట్స్‌తో ప్రేక్షకులను ఊపేసేలా ప్లాన్ చేస్తున్నారట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాశి ఖన్నా అధికారికంగా Confirm అయితే, సినిమా గ్రాండినెస్కు మరింత బలం చేకూరనుంది..









