గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ కోసం పూర్తిగా మారిపోయారు. ఈ మాస్ మల్టీ-లెవెల్ ప్రాజెక్ట్‌లో ఓ పవర్‌ఫుల్ పాత్రను పోషించేందుకు, చరణ్ గతంలో ఎప్పుడూ చూడని లుక్‌లో కనిపించబోతున్నారు.రేపటి నుండి ప్రారంభం కానున్న కీలక షెడ్యూల్‌కు ముందే, ఆయన తన ఫిజిక్‌ను పూర్తిగా మార్చేశారు. కఠినమైన వ్యాయామం, కంటిన్యూయస్ ట్రైనింగ్‌తో శారీరకంగా సాలిడ్ ట్రాన్స్ఫర్మేషన్ చేశారు. ఇటీవల జిమ్‌లో తీసిన ఫోటోలో చరణ్… రగ్గ్డ్ బీర్డ్, ముడివేసిన జుట్టు, మసిలిన శరీరంతో ఒక బీస్ట్ లా కనిపిస్తున్నారు..ఇది లుక్ మార్పు కాదు – పాత్రపై చరణ్ అంకితభావానికి అద్దం పడుతుంది. రెగ్యులర్ మోడ్‌ను పక్కనపెట్టి, గ్రీక్ గాడ్‌లా దర్శనమిస్తున్న ఈ నూతన అవతార్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు..మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలవ్వనున్న ‘పెద్ది’, ఇప్పటికే భారీ అంచనాల్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు చరణ్ చేసిన ఇంటెన్స్ ప్రిపరేషన్ చూసి, ఈ ప్రాజెక్టుపై ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింతగా పెరిగింది.









